KL Rahul | ఏమో సార్ నాకు తెలియదు..! కెఎల్ ఫిట్‌నెస్‌పై టీమిండియా బ్యాటింగ్ కోచ్ కామెంట్స్
KL Rahul | హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన కెఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో వైజాగ్, రాజ్‌కోట్ టెస్టులకు దూరమయ్యాడు. తాజాగా రాంచీ టెస్టు వరకైనా అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశించినా...
KL Rahul | భారత క్రికెట్ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఆడతాడా..? లేదా..? హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన అతడు తొడ కండరాల గాయంతో వైజాగ్, రాజ్‌కోట్ టెస్టులకు దూరమయ్యాడు. తాజాగా రాంచీ టెస్టు వరకైనా అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశించినా రెండ్రోజుల క్రితమే బీసీసీఐ.. అతడు ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడని చావు కబురు చల్లగా చెప్పింది. తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్.. కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఏ మేరకు ఫిట్‌గా ఉన్నాడో తనకు తెలియదని రాథోడ్ చెప్పుకొచ్చాడు.
రాంచీ టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాథోడ్ మాట్లాడుతూ… ‘కెఎల్ రాహుల్ ఎంత మేరకు ఫిట్నెస్ సాధించాడో నాకైతే తెలియదు. మ్యాచ్ ఆడేంత ఫిట్నెస్ అతడికి ఉందా..? అంటే మాత్రం నేను లేదు అనే చెబుతాను. అతడి పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నది..’ అని చెప్పాడు. రాజ్‌కోట్ టెస్టుకు ముందు 90 శాతం ఫిట్‌గా ఉన్నాడని.. రాంచీ టెస్టులో ఆడతాడని వార్తలు వచ్చినా రాహుల్ మరోసారి గాయం కారణంగా నాలుగో టెస్టు నుంచి కూడా దూరమయ్యాడు.
రాంచీ పిచ్‌పై..
రాంచీ పిచ్‌లో పగుళ్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకుంటారని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో రాథోడ్ స్పందించాడు. రాంచీ వికెట్‌ను ‘టిపికల్ ఇండియన్ వికెట్’ అని అన్నాడు. భారత్‌లో మ్యాచ్‌లు జరిగినప్పుడు పిచ్‌ల గురించి చర్చలు జరుగడమేనని అన్న రాథోడ్.. రాంచీ పిచ్‌పై పగుళ్లు కొత్తగా వచ్చినవి కాదని, ఇక్కడ మ్యాచ్ ఎప్పుడు జరిగినా అది అలాగే ఉంటుందని అన్నాడు. అది ఇక్కడి పిచ్‌లోని స్వభావమని చెప్పిన రాథోడ్.. రాంచీలో బంతి ఏ మేరకు టర్న్ అవుతుందనేది తనకూ క్లారిటీ లేదని, మ్యాచ్ జరుగుతున్న కొద్దీ అది తెలుస్తుందని వ్యాఖ్యానించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

