గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ ఎఫ్‌సీ మరో విజయంపై కన్నేసింది. లీగ్‌లో సమఉజ్జీగా ఉన్న ఒడిశా ఎఫ్‌సీతో గురువారం హెచ్ఎఫ్సీ ఢీకొనబోతున్నది. ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచిన హైదరాబాద్ ఫుల్ జోష్ మీద ఉంది. గత మ్యాచ్‌లో ఎస్సీ ఈస్ట్బెంగాల్పై 4-0 తేడాతో హెచ్ఎఫ్సీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ స్ట్రైకర్ ఓగ్బాచె జట్టులోకి వచ్చి రావడంతోనే హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. 48 గోల్స్‌తో ఉన్న ఓగ్బాచే ఒడిశాతో జరిగే మ్యాచ్‌లో మరో రెండు సాధిస్తే ఐఎస్ఎల్లో 50 గోల్స్ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. గత మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తిన్న ఒడిశా ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది.