హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ సెయిలింగ్ వీక్ టోర్నీ ఉత్కంఠగా సాగుతున్నది. పోటీలకు రెండో రోజైన గురువారం జరిగిన మహిళల ఐఎల్సీఏ 6 రేసులో ఎన్ఎస్ఎస్ క్లబ్‌కు చెందిన రితికా దంగి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బరిలోకి దిగిన మూడు రేసుల్లోనూ విజయం సాధించింది.