హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ దుమ్మురేపుతున్నది. సొంతగడ్డపై అభిమానుల మద్దతు మధ్య హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.
మంగళవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 15-13, 14-15, 9-15, 15-10, 15-12తో బెంగళూరుపై ఉత్కంఠ విజయం సాధించింది. మొత్తంగా ఈ సీజన్లో నాలుగో విజయంతో హైదరాబాద్ నాలుగో స్థానానికి చేరుకుంది. బెంగళూరుతో పోరులో హైదరాబాద్ తరఫున కెప్టెన్ గురుప్రశాంత్, ట్రెంట్ ఒడియ, హేమంత్ రాణించారు.