Huge Six | ఎంత భారీ సిక్సర్ కొట్టాడంటే.. బంతి వెళ్లి మైదానం బయట ఉన్న ఇంట్లో పడింది
ఒకప్పుడు తన సూపర్ ఫీల్డింగ్, అద్భుతమైన బ్యాటింగ్‌తో ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ లిన్.. ఆ తర్వాత తెరమరుగయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కామెంటేటర్‌గా కనిపించాడు. బిగ్‌బ్యాష్ లీగ్‌లో 11 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్ జట్టు కూడా అతన్ని తొలగించింది.
దీంతో అతని కెరీర్ ముగిసినట్లే అని అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లీగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడీ ఆసీస్ బ్యాటర్ నార్తాంప్టన్‌షైర్‌కు ఆడుతున్న అతను.. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో లిన్ ఒక సిక్సర్ కొట్టేందుకు బంతిని ఎంత బలంగా బాదాడంటే.. అది వెళ్లి పక్కనే ఉన్న ఒక ఇంటి తోటలో పడింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని ట్విట్టర్లో విడుదల చేసిన ఆ ఇంటి యజమాని.. ఆ తర్వాత లిన్ సిక్సర్ కొట్టిన బంతిని చూపిస్తూ మరో ఫొటో ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, లిన్‌తో పాటు మరో ఓపెనర్ బెన్ కర్రాన్‌తో కలిసి 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో 223 పరుగుల భారీ స్కోరు చేసిన ఆ జట్టు.. మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది.
https://twitter.com/i/status/1530265590018998272
https://twitter.com/cobbleysaint/status/1530256874217644035
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

