Hockey India | హాకీ ఇండియాకు మరో షాక్.. జీతం ఇవ్వట్లేదని సీఈఓ రాజీనామా
Hockey India : హాకీ ఇండియాకు మరో షాక్ తగిలింది. మహిళల జట్టు చీఫ్ కోచ్ జన్నెకె స్కాప్‌మన్(Janneke Schopman) పదవి నుంచి వైదొలిగిన రెండు రోజులకే సీఈఓ ఎలెనా నార్మన్(Elena Norman) కూడా రాజీనామా చేసింది. కొన్ని నెలలుగా జీతం చెల్లించడం లేదనే...
Hockey India : హాకీ ఇండియాకు మరో షాక్ తగిలింది. మహిళల జట్టు చీఫ్ కోచ్ జన్నెకె స్కాప్‌మన్(Janneke Schopman) పదవి నుంచి వైదొలిగిన రెండు రోజులకే సీఈఓ ఎలెనా నార్మన్(Elena Norman) కూడా రాజీనామా చేసింది. కొన్ని నెలలుగా జీతం చెల్లించడం లేదనే కారణంతో ఆమె పదవి నుంచి వైదొలిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలెనా 13 ఏండ్లుగా హాకీ ఇండియా కోచ్‌గా సేవలందించింది.
అయితే.. గత మూడు నెలలుగా ఆమెకు జీతం ముట్టలేదు. అంతేకాదు హాకీ ఇండియా పనితీరు పట్ల ఎలెనా కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉంది. దానికి తోడూ సమయానికి శాలరీ ఇవ్వట్లేదు. దాంతో, ఆమె చివరకు సీఈఓ పదవికి రిజైన్ చేసింది.
ఒడిశా టోర్నమెంట్ జెర్సీ ఆవిష్కరిస్తున్న ఎలెనా

ఎలెనా రాజీనామాను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టర్కీ ఆమోదించాడు. హాకీ ఇండియాకు ఎలెనా చేసిన సేవల్ని దిలీప్ కొనియాడాడు. ఎలెనా అంకితభావం, పట్టుదల భారత హాకీ గతినే మార్చేశాయి. ఆమె హయాంలో భారత పురుషుల, మహిళల జట్లు అత్యుత్తమ ర్యాకింగ్స్ సాధించాయి. ఎలెనా 12-13 ఏండ్లుగా ఎంతో నిబద్ధతతో పని చేసింది. అందుకు ఆమెకు ధన్యవాదాలు అని టర్కీ ఓ ప్రకటనలో తెలిపాడు.
జన్నెకె స్కాప్‌మన్

రెండు రోజుల వ్యవధిలోనే స్కాప్‌మన్, ఎలెనా రాజీనామాలతో హాకీ ఇండియాలో అసలు ఏం జరుగుతోంది? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. భారత మహిళల జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన చీఫ్ కోచ్ స్కాప్‌మన్ అనూహ్యంగా తన పదవికి రిజైన్ చేసింది. భారత్‌లో మహిళలకు గౌరవం లేదని, తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని సంచలన ఆరోపణలు చేసిన ఆమె నేను ఇక్కడ ఉండలేనంటూ వైదొలిగింది.

స్కాప్‌మన్ కోచింగ్‌లో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. ఆసియా క్రీడల్లో తొలిసారి కాంస్య పతకం గెలిచింది. అయితే ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఓటమితో ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తును కోల్పోయింది. అయినా కూడా స్కాప్మన్ను కొనసాగించాలని హాకీ ఇండియా అనుకుంది. కానీ, ఆమె సంచలన ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేసింది.
ఇవి కూడా చదవండి
- Heart Attack | భర్త మృతితో భార్య ఆత్మహత్య.. పెళ్లైన మూడు నెలలకే అనంతలోకాలకు
- Akhilesh Yadav | రాజ్యసభ ఎన్నికల ఓటింగ్..ఎమ్మెల్యేలకు కాషాయ పార్టీ బెదిరింపులు : ఎస్పీ చీఫ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

