ఢిల్లీ : భారత రోయింగ్ చరిత్రలో కొత్త అధ్యాయం. భారత ఆర్మీకి చెందిన ఉజ్వల్ కుమార్, లక్షయ్ 2006 వరల్డ్ రోయింగ్ కప్-3లో స్వర్ణం గెలుచుకుని సరికొత్త చరిత్ర లిఖించారు.
స్విట్జర్లాండ్లోని లాసెర్న్లో జరిగిన ఈ టోర్నీలో భాగంగా.. లైట్ వెయిట్ మెన్స్ డబుల్స్ స్కల్స్ ఈవెంట్ ఫైనల్లో ఈ భారత జోడీ 6:26.09 నిమిషాల్లో రేసును పూర్తిచేసి స్వర్ణం గెలుచుకుంది. వరల్డ్ రోయింగ్ కప్ ఈవెంట్లో పసిడి పతకం నెగ్గడం భారత్కు ఇదే మొదటిసారి కావడం విశేషం.