జీవీ నారాయణరావు, ప్రసాద్‌బాబు, నరసింహరాజు, రాజన్హరి, మహర్షి రాఘవ, జయలలిత, సీనియర్ నటుడు సుధాకర్ తనయుడు బెన్నీ సుధాకర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆలోచన’. సురేందర్ చాచా రచనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి ప్రదీప్‌కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మాతలు. పోస్ట్‌ప్రొడక్షన్ పూర్తి చేసుకొని త్వరలో సినిమా విడుదలకానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ ఈ పోస్టర్ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. స్నేహం గొప్పతనాన్ని తెలిపేలా మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను నిర్మించారని మురళీమోహన్ చిత్రబృందాన్ని అభినందించారు. చిత్రానికి కెమెరా: టి.సురేంద్రరెడ్డి, సంగీతం: వియాన్, నిర్మాణం: పి.ఎస్.జె ఫిల్మ్స్.