హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(టీబీఏ) 2025 సీజన్ కోసం సమగ్ర భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీనిపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో తొలిసారి అధికారికంగా నిర్వహించబోయే కళాశాల స్థాయి బాస్కెట్‌బాల్ లీగ్(టీసీబీఎల్)కు వోక్సెన్ సాంకేతిక సహకారం అందించనుంది.
బ్రాండింగ్‌తో పాటు వాణిజ్య కార్యకలాపాలు, సాంకేతిక పర్యవేక్షణ లాంటి అంశాలను యూనివర్సిటీ చూసుకోనుంది. రాష్ట్రంలో బాస్కెట్‌బాల్ అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని టీబీఏ అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రౌల్ రోడ్రిగ్స్, పృథ్వీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.