హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా యూనివర్సిటీ చాంపియన్‌షిప్ రోయింగ్‌లో హేమలత స్వర్ణం సాధించింది. చండీగఢ్ వేదికగా జరిగిన పోటీల్లో హేమలత ఉస్మానియా యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగి సత్తాచాటింది. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో రోయింగ్‌లో ఓనమాలు దిద్దుకున్న హేమలత.. జాతీయ పోటీల్లో తిరుగులేని ప్రదర్శన కనబర్చింది.