ఇంజమామ్‌కు గుండెపోటు
- అంజియోప్లాస్టీ తర్వాత డిశ్చార్జి

లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమాముల్ హక్ గుండెపోటుకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో సోమవారం దవాఖానలో చేరాడు. పలు పరీక్షల అనంతరం సీనియర్ సర్జన్ అబ్బాస్ ఖాజీమ్ నేతృత్వంలోని వైద్యుల బృందం అంజియోప్లాస్టి నిర్వహించింది. శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న దవాఖాన వర్గాలు మంగళవారం డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నాయి. 51 ఏండ్ల ఇంజమామ్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువురు ప్లేయర్లు ట్విట్టర్లో అభిలషించారు. పాకిస్థాన్ తరఫున 120 టెస్టులు, 378 వన్డేలాడిన ఇంజమామ్..2016-19 మధ్యకాలంలో పీసీబీ చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై గెలిచిన పాక్ టైటిల్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- heart attack
- Inzamam
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

