Hardik Pandya: హార్దిక్ పాండ్యా సోదరుడిపై చీటింగ్ కేసు.. వైభవ్ పాండ్యా అరెస్టు
Hardik Pandya: హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాల సవతి సోదరుడు వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరు క్రికెటర్ల వద్ద 4.3 కోట్ల చీటింగ్‌కు పాల్పడినట్లు వైభవ్‌పై ఫిర్యాదు నమోదు అయ్యింది.
ముంబై: హార్దిక్ పాండ్యా(Hardik Pandya), కృణాల్ పాండ్యాల సవతి సోదరుడు వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరు క్రికెటర్ల వద్ద 4.3 కోట్ల చీటింగ్‌కు పాల్పడినట్లు వైభవ్‌పై ఫిర్యాదు నమోదు అయ్యింది. తమ భాగస్వామ్య వ్యాపారం నుంచి అతను ఆ డబ్బును డైవర్ట్ చేశాడని, దాని వల్ల పాండ్యా సోదరులకు నష్టం వాటిల్లింది. 2021లో హార్దిక్, కృణాల్, వైభవ్‌లు కలిసి ఓ వ్యాపారం మొదలుపెట్టారు. ఆ ఒప్పందం ప్రకారం హార్దిక్, కృణాల్ పాండ్యాలకు 40 శాతం ప్రాఫిట్ వెళ్తుంది. ఇక వైభవ్‌కు 20 శాతం మాత్రమే దక్కుతుంది. వైభవ్ పాండ్యా కొత్తగా ఓ వ్యాపారం మొదలుపెట్టి, ఆ గ్రూపునకు ఫండ్స్‌ను తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ప్రకారం .. వైభవ్‌పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు. హార్దిక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైభవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

