Hardik Pandya | ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ కోచ్ డేవ్ వాట్మోర్ విమర్శలు..
Hardik Pandya | టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొంతకాలంలో మైదానంలో, వ్యక్తిగత జీవితంలోనూ కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు.
Hardik Pandya | టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొంతకాలంలో మైదానంలో, వ్యక్తిగత జీవితంలోనూ కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ అనంతరం టీ20 క్రికెటర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ రేసులో ముందున్నా.. సూర్యకుమార్ యాదవ్‌కు దక్కిన విషయం తెలిసిందే. హార్దిక్ టీ20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్ పాత్రను పోషించగా.. అయితే శ్రీలంక పర్యటనలో ఆటగాడిగా కొనసాగనున్నాడు. అయితే, హార్దిక్ పాండ్యాపై దేశవాళీ జట్టు బరోడ్ మాజీ కోచ్ డేవ్ వాట్మోర్ విమర్శలు అప్పగించారు.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సూర్యకుమార్‌కు కెప్టెన్సీని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ హార్దిక్ ఫిట్నెస్ గురించి ఆందోళన చెందుతున్నారు. 2018 నుంచి హార్దిక్ తన దేశవాళీ జట్టు బరోడా తరఫున ఏ మ్యాచ్ ఆడలేదని విమర్శించారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ దేశీయ టోర్నమెంట్ నుంచి వన్డేల వరకు హార్దిక్ ఫిట్నెస్ను పర్యవేక్షించాలని నిర్ణయించింది. అయితే, హార్దిక్ తన దేశీయ జట్టుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాట్మోర్ విమర్శించారు. హార్దిక్ చివరిసారిగా 2018లో ముంబయి-బరోడా మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే.
వైట్‌బాల్ ఫార్మాట్లో ఆడని చాలా మంది ఆటగాళ్లు ఉన్నారని వాట్మోర్ ఓ యూట్యూబ్ ఛానెల్లో తెలిపారు. బరోడాలో నా గత కొన్ని సంవత్సరాల్లో హార్దిక్ ఎప్పుడూ వైట్‌బాల్ ఫార్మాట్లో ఆడలేదన్నారు. హార్దిక్‌ను బరోడా ఆల్‌రౌండర్‌గా పిలుచుకోవడం నాకు ఎప్పుడూ వింతగా అనిపించే విషమని.. కానీ అతను ఈ జట్టు కోసం ఏళ్ల తరబడి ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదన్నారు. రంజీ ట్రోఫీతో సహా ఇతర దేశవాళీ క్రికెట్ లీగ్‌లలో ఆటగాళ్లు ఆడాలని బీసీసీఐ కోరుతున్నట్లు ఇటీవల నేను చూశానన్నారు. టీ20 వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా ముఖ్యపాత్ర పోషించాడు. ప్రస్తుతం జూలై 27 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచుల సిరీస్‌లో పాల్గొనన్నున్నాడు. ఇప్పటికే జట్టుతో శ్రీలంకకు చేరుకున్నాడు. మంగళవారం శిక్షణా సెషన్లోనూ పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

