Hardik Pandya | పొట్టి ఫార్మాట్లో పాండ్యానే బెస్ట్.. తేల్చేసిన ఆసీసె లెజెండ్
Hardik Pandya | టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తన పీక్ ఫామ్‌లో ఉన్నాడు. అటు బంతితో, ఇటు బ్యాటుతో చెలరేగి జట్టుకు అవసరమైన విజయాలు అందిస్తున్నాడు. అతని ఆటతీరు చూస్తుంటే ఆ ఫీలింగే వేరని,
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తన పీక్ ఫామ్‌లో ఉన్నాడు. అటు బంతితో, ఇటు బ్యాటుతో చెలరేగి జట్టుకు అవసరమైన విజయాలు అందిస్తున్నాడు. అతని ఆటతీరు చూస్తుంటే ఆ ఫీలింగే వేరని, అతను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వాట్సన్ చెప్పాడు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడేందుకు భారత్ వచ్చిన ఈ 41 ఏళ్ల మాజీ ఆసీస్ ఆల్‌రౌండర్.. ఫాస్ట బౌలింగ్ ఆల్‌రౌండర్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్యా ఫామ్ చూసిన చాలా మంది అతన్ని ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌తో పోలుస్తున్నారు. దీనిపై కూడా వాట్సన్ స్పందించాడు. ప్రస్తుతం పాండ్యా అత్యుత్తమంగా ఆడుతున్నాడని, టీ20 క్రికెట్ అంత వరకు తీసుకుంటే మాత్రం.. స్టోక్స్ కన్నా పాండ్యా చాలా మెరుగైన స్థాయిలో ఉన్నాడని తేల్చిచెప్పాడు.
కొంతకాలం క్రితం గాయం కారణంగా బౌలింగ్‌కు దూరమైన పాండ్యా.. విశ్రాంతి తీసుకొని పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా కూడా ప్రతిభ కనబరిచి తన జట్టుకు ట్రోఫీ అందించాడు. ఈ క్రమంలోనే మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. అంతేకాదు, ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జట్టుకు నాయకత్వం వహించి, జట్టును గెలిపించాడు కూడా.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

