Hardik Pandya: పకడ్బందీగా ప్లాన్ చేశావ్‌గా పాండ్యా..! వర్కవుట్స్ కోసం చార్ట్.. ఇదే ఊపు కంటిన్యూ చేస్తే ఐపీఎల్లో రీఎంట్రీ పక్కా
Hardik Pandya: వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాలి మడమ గాయం తర్వాత హార్ధిక్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు జిమ్‌లో చెమటోడ్చుతున్న పాండ్యా..
Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్ – 17లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ సారథిగా బరిలోకి దిగబోతున్న పాండ్యా.. ఐపీఎల్ నాటికి పూర్తిస్థాయిలో సిద్ధమవడానికి కసరత్తులు ముమ్మరం చేశాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో పూణే వేదికగా ముగిసిన మ్యాచ్‌లో కాలి మడమకు గాయమవడంతో హార్ధిక్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు జిమ్‌లో చెమటోడ్చుతున్న పాండ్యా.. తాజాగా తన దినచర్యలో భాగంగా చేసే కసరత్తులకు సంబంధించిన ఆసక్తికర వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
హార్ధిక్ తాజాగా షేర్ చేసిన వీడియోలో ఓ చార్ట్‌ను ప్రిపేర్ చేసుకున్నాడు. అందులో పేర్కొన్న దాని ప్రకారం.. బాడీని కసరత్తులకు ప్రిపేర్ చేసేందుకు గాను మొదట ఐదు నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ కోసం కేటాయిస్తున్నాడు. ఆ తర్వాత టెంపో బ్రీతింగ్ మూడు సెట్లను పది సార్లు చేయడం మరోసారి కొద్దిసేపు వాకింగ్ చేసిన తర్వాత వర్క్అవుట్స్ సెషన్ మొదలుపెడుతున్నాడు. వర్క్అవుట్స్లో భాగంగా బాటిల్ రోప్, స్కిప్పింగ్, జంప్ రోప్, స్పిన్నింగ్ వంటివి చేస్తాడు. వీటిలో ఒక్కొక్కదానికోసం సుమారు 15 నిమిషాల పాటు కేటాయిస్తున్నాడు. వర్కవుట్స్ చేసేప్పుడు మధ్యలో ఐదు నిమిషాల పాటు బ్రేక్ ఇవ్వడం ఆ తర్వాత దానిని కొనసాగించడం వంటివి చేస్తున్నాడు. హార్ధిక్ షేర్ చేసిన వర్కవుట్స్ బోర్డు జాబితాను చూస్తే కనీసం రోజులో ఆరు నుంచి 8 గంటల పాటు కసరత్తులకే వినియోగిస్తున్నట్టు తెలుస్తున్నది.
30 ఏండ్ల ఈ ఆల్ రౌండర్ ఐపీఎల్ సమయానికి పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో అప్పటివరకూ రీఎంట్రీతో పాటు కెప్టెన్‌గా తానెంటో ప్రూవ్ చేసుకునేందుకు ఐపీఎల్ అతడికి మంచి వేదిక. ఈసారి అతడు ముంబై సారథి కూడా కావడంతో అతడిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

