Harbhajan Singh | ఒలింపిక్స్‌లో సత్తా చాటడం గర్వకారణం : నీరజ్ చోప్రాకు హర్భజన్ సింగ్ అభినందనలు
Harbhajan Singh : ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించడం గొప్ప విషయమని భారత మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ అన్నారు.
Harbhajan Singh : ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించడం గొప్ప విషయమని భారత మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ అన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే అద్భత అవకాశం కేవలం కొద్దిమంది అథ్లెట్లకే లభిస్తుందని చెప్పారు. ఒలింపిక్స్‌లో దేశం తరపున పాల్గొన్న క్రీడాకారులందరికీ తాను శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొని సత్తా చాటడం ఏమంత సులభం కాదని, దీనికి చిత్తశుద్ధి, కఠోర శ్రమ అవసరమని పేర్కొన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను తాను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. నీరజ్ చాలా బాగా ఆడాడని, ఆయన తమ బంగారం అని హర్భజన్ అన్నారు. భారత రెజ్లర్ వినేశ్ పొఘాట్పై అనర్హత వేటు పడిన విషయం ప్రస్తావిస్తూ ఈ సంక్లిష్ట సమయంలో తాను ఆమె వెన్నంటి నిలుస్తానని, ఆమె బాధను కేవలం ఓ అథ్లెట్ మాత్రమే అర్ధం చేసుకోగలరని చెప్పారు. వినేష్ పొఘాట్ రజత పతకానికి అర్హురాలని హర్భజన్ సింగ్ తేల్చిచెప్పారు. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సత్తా చాటాడు. భారత్‌కు స్వర్ణం అందిస్తాడనే అంచనాలను అధిగమించలేకపోయినా రజతం దక్కించుకున్నాడు.
రజత పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నీరజ్ చోప్రాతో మాట్లాడిన ప్రధాని అతడి గాయం గురించి ఆరా తీసి సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు.నీరజ్ చోప్రా రజత పతకం సాధించడంపై చోప్రా తల్లి స్పందించిన తీరునూ ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఆమె క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని ప్రశంసించారు. కాగా, నాలుగేండ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగి బరిసెతో భారత్‌కు అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందించిన ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా పారిస్‌లోనూ రజతంతో మెరిశాడు.
Read More :
Indian 2 | ఓటీటీలోకి వచ్చేసిన కమల్ హాసన్ ఇండియన్ 2.. ఫ్లాట్‌ఫాం ఇదే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

