Gurivinder Veer | భారత అథ్లెటిక్స్ చరిత్రలో సరికొత్త సంచలనం.. జాతీయ రికార్డు బద్దలు..!
Gurivinder Veer | భారత అథ్లెటిక్స్ (India Athletics) లో సరికొత్త సంచలనం నమోదైంది. పరుగు పందెంలో మనకు ఒక ఉసేన్ బోల్ట్ దొరికేశాడంటూ క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రాంచీ (Ranchi) వేదికగా జరుగుతున్న 2026 అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో పంజాబ్ (Punjab) కు చెందిన 25 ఏళ్ల గురిందర్‌వీర్ చిరుతలా పరుగెత్తాడు.
Gurivinder Veer : భారత అథ్లెటిక్స్ (India Athletics) లో సరికొత్త సంచలనం నమోదైంది. పరుగు పందెంలో మనకు ఒక ఉసేన్ బోల్ట్ దొరికేశాడంటూ క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రాంచీ (Ranchi) వేదికగా జరుగుతున్న 2026 అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో పంజాబ్ (Punjab) కు చెందిన 25 ఏళ్ల గురిందర్‌వీర్ చిరుతలా పరుగెత్తాడు. పురుషుల 100 మీటర్ల ఫైనల్లో కేవలం 10.09 సెకన్లలోనే గమ్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు.
తన అద్భుత ప్రదర్శనతో గురిందర్‌వీర్ భారత అథ్లెటిక్స్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించాడు. 10.10 సెకన్ల కంటే తక్కువ సమయంలో 100 మీటర్ల దూరాన్ని పూర్తి చేసిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా నిలిచాడు. రిలయన్స్ ఫౌండేషన్ తరఫున బరిలోకి దిగిన గురిందర్‌వీర్, పాత జాతీయ రికార్డును బద్దలు కొట్టి ఈ చారిత్రక విజయాన్ని అందుకున్నాడు.
అద్భుతమైన టైమింగ్‌తో గురిందర్‌వీర్ 2026 కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత కూడా సాధించాడు. కామన్వెల్త్ క్రీడల అర్హత మార్క్ 10.16 సెకన్లు కాగా.. దాన్ని వీర్ సునాయాసంగా అధిగమించాడు. ఇదే ఈవెంట్లో అనిమేష్ కుజుర్ (10.20 సెకన్లు) రజతం గెలుచుకోగా, ప్రణవ్ గురవ్ (10.29 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా గురిందర్‌వీర్ విజయం భారత స్ప్రింటింగ్‌లో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

