అహ్మాదాబాద్: గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్(Yash Dayal)కు అరణ్య రోదనే మిగిలింది. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ తన హిట్టింగ్తో చుక్కులు చూపించాడు. రింకూ కొట్టుడుతో యశ్ దయాల్ షాక్‌లోకి వెళ్లపోయాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్.. చివరి ఓవర్లో కేకేఆర్ బ్యాటర్ రింకూ(Rinku) వరుసగా అయిదు సిక్సర్లు కొట్టి సంచలన విజయాన్ని నమోదు చేశాడు. అయితే ఆ ఓవర్‌ను యశ్ దయాల్ వేశాడు. గుడ్లెన్త్ బౌల్స్ వేసిన యశ్ దయాల్‌ను నిర్దాక్షిణ్యంగా బాదేశాడు రింకూ. కేకేఆర్ బ్యాటర్ జోరుకు.. దయాల్‌కు అవమానమే మిగిలింది. ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయాడతను. చివరి బంతి ముగిశాక టవల్‌తో తన ముఖాన్ని కప్పేసుకున్నాడు యశ్ దయాల్.
Yash Dayal couldn't believe what had just happened.
Rinku Singh the artist! pic.twitter.com/iVSaW6PFLv
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2023