GT vs CSK | ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కాసేపట్లో తలపబడనున్నాయి. పుణె వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ దూసుకెళ్తుండగా.. చెన్నై మాత్రం ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి 9వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ మ్యాచ్ గెలవడం చెన్నైకి కీలకంగా మారింది.
ఇదిలా ఉంటే గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.