GT vs CSK | ఐపీఎల్లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ ముగిసింది. ఇప్పటికే వరుస పరాజయాలతో వెనుకంజలో ఉన్న సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ టైటాన్స్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండి ఫుల్‌ఫామ్‌లో దూసుకెళ్తున్న గుజరాత్ ఆటగాళ్లు.. చెన్నై బ్యాటర్లు ఆది నుంచే కట్టడి చేశారు. పవర్ ప్లే పూర్తయ్యేలోపే రెండు వికెట్లను తీశారు. రాబిన్ ఉతప్ప (3), మొయిన్ అలీ (1) తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (73), అంబటి రాయుడు (46) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 92 పరుగులు చేశారు. వీరు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శివమ్ ధూబే (19), రవీంద్ర జడేజా (22) కూడా రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి చెన్నై 169 పరుగులు చేసింది. గుజరాత్‌కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.