న్యూయార్క్: రౌండ్32 నాకౌట్లో చోటు సంపాదించింది ఈక్వెడార్. ఫిఫా వరల్డ్‌కప్(Fifa World Cup)లో భాగంగా న్యూజెర్సీలో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో ఈక్వెడార్ స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. అయితే మూడవ స్థానంలో ఉన్న టాప్ 8 జట్లు కూడా రౌండ్32కు అర్హత సాధించే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రౌండ్32లో ఇంగ్లండ్‌తో ఈక్వెడార్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక బలమైన జర్మనీ జట్టును అనూహ్య రీతిలో ఈక్వెడార్ ఓడించింది. జర్మనీ ఇప్పటికే రెండు విక్టరీలతో నాకౌట్ దశకు క్వాలిఫై అయ్యింది. గ్రూపు ఈ నుంచి ఐవరీ కోస్టు కూడా నాకౌట్‌కు వెళ్లింది. జర్మనీ ప్లేయర్ సేన్ రెండో నిమిషంలోనే గోల్ చేసి ఆ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. కానీ ఈక్వెడార్ ప్లేయర్ నీల్సన్ ఆంగులో 9వ నిమిషంలో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. సెకండ్ హాఫ్‌లో జర్మనీకి పెనాల్టీ వచ్చినా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయితే ఆఖరి క్వార్టర్లో మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగింది. 77వ నిమిషంలో ఈక్వెడార్ ప్లేయర్ గొంజాలెజ్ ప్లాటా గోల్ చేసి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే మూడవ స్థానంలో ఉన్న బెస్ట్ 8 టీమ్స్ కూడా నాకౌట్ వెళ్తాయి. ఈక్వెడార్ ఆ కేటగిరీలో నాకౌట్‌కు వెళ్లింది.