తాష్కెంట్: ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ జిల్లీ దాలబెహెర స్వర్ణ పతకంతో మెరిసింది. ఆదివారం జరిగిన మహిళల 45కిలోల కేటగిరీలో బరిలోకి దిగిన దాలబెహెర అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. స్నాచ్(69కి), క్లీన్ అండ్ జర్క్(88కి) మొత్తంగా 157కిలోలు ఎత్తి టాప్‌లో నిలిచింది. ఇదే విభాగంలో మ్యారీ ఫ్లోర్ దియాజ్(ఫిలిప్పిన్స్) రజతం దక్కించుకుంది. టోర్నీలో మీరాబాయి చానుకు కాంస్య పతకం తర్వాత భారత్‌కు ఇది రెండోది.