Gold Medal | ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో గుల్వీర్ సింగ్‌కు స్వర్ణం
Gold Medal | భారత స్టార్ రన్నర్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ (Asian Athletics Championship) లో స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల 10 వేల మీటర్ల రేసును గుల్వీర్ 28 నిమిషాల 38.63 సెకన్లలో ముగించి మెడల్ అందుకున్నాడు.
Gold Medal : భారత స్టార్ రన్నర్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ (Asian Athletics Championship) లో స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల 10 వేల మీటర్ల రేసును గుల్వీర్ 28 నిమిషాల 38.63 సెకన్లలో ముగించి మెడల్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే గుల్వీర్ జాతీయ రికార్డు కూడా నెలకొల్పాడు. ఇక జపాన్‌కు చెందిన మెబుకి సుజుకీ 10 వేల మీటర్ల రేసును 28 నిమిషాల 43.84 సెకన్లతో ముగించి రజత పతకం సాధించాడు.
అదేవిధంగా బహ్రెయిన్‌కు చెందిన ఆల్బర్ట్ కిబిచి రోప్ 28 నిమిషాల 46.82 సెకన్లతో కాంస్య పతకం గెలుచుకున్నాడు. గుల్వీర్ సింగ్ మరో పతకం సాధించే అవకాశం కూడా ఉంటుంది. మే 30న జరిగే పురుషుల 5000 మీటర్ల ఫైనల్లోనూ అతను పాల్గొననున్నాడు. 5 వేల మీటర్ల రేసులో గుల్వీర్కు మంచి రికార్డు ఉంది. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో సెర్విన్ సెబాస్టియన్ (1 గంట 21 నిమిషాల 13.60 సెకన్లు) కాంస్యం సాధించాడు.
చైనాకు చెందిన వాంగ్ జావోజావో (1 గంట 20 నిమిషాల 36.90 సెకన్లు) స్వర్ణ పతకం అందుకోగా, జపాన్‌కు చెందిన కెంటో యోషికావా (1 గంట 20 నిమిషాల 44.90 సెకన్లు) రజతం దక్కించుకున్నాడు. మహిళల జావెలిన్‌త్రోలో అన్నురాణి త్రుటిలో కాంస్యం పతకం చేజార్చుకుంది. అన్నురాణి బెస్ట్ త్రో 58.30 మీటర్లు కాగా.. 64 సెంటీమీటర్ల తేడాతో నాలుగో స్థానంలో నిలిచి మెడల్‌ను మిస్ చేసుకుంది. జపాన్‌కు చెందిన సే టకేమోటో (58.94 మీటర్లు) కాంస్య పతకం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

