ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాలికల జట్టు స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. అరీబా ఖాన్, రిజా ధిల్లాన్, గనేమత్ సెఖాన్తో కూడిన భారత జట్టు.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ తుదిపోరులో ఇటలీపై విజయం సాధించింది. అదిరే గురితో టార్గెట్‌పై బుల్లెట్ల వర్షం కురిపించిన మన అమ్మాయిలు 6-0తో ఇటలీని చిత్తుచేశారు. బాలుర విభాగంలో రజ్వీర్ గిల్, ఆయుష్ రుద్రరాజు, అభయ్ సింగ్‌తో కూడిన భారత జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఇదే టోర్నీలో బాలికల వ్యక్తిగత విభాగంలో గనేమత్ రజతం సాధించింది.