Glenn Phillips : న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్(Glenn Phillips) చరిత్రకెక్కాడు. కెన్నింగ్టన్ ఓవల్ టెస్టులో శతకంతో చెలరేగిన కివీస్ స్టార్ అన్ని ఫార్మాట్లలో సెంచరీ నమోదు చేశాడు. తద్వారా మూడు ఫార్మాట్లలో శతకం బాదిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. విధ్వంసక ఆటతో అలరించిన ఫిలిఫ్స్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ భారీ స్కోర్(391)లో కీలకమయ్యాడు.
మైదానంలో ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకునే గ్లెన్ ఫెలిప్స్ ఈసారి బ్యాటుతో రికార్డులు బద్ధలు కొట్టాడు. కెన్నింగ్టన్ ఓవల్లో జరుగుతున్న రెండో టెస్టులో రెచ్చిపోయిన ఫిలిప్స్ శతకంతో దిగ్గజాల సరసన చేరాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో సెంచరీ సాధించిన ఈ ఆల్రౌండర్ ఓవల్ వందతో మూడు ఫార్మాటల్లో ఈ ఫీట్ అందుకున్నాడు.
Brendon McCullum. Martin Guptill. Glenn Phillips!
Only three New Zealand men have scored hundreds in Tests, ODIs and T20Is 💫 pic.twitter.com/ysrI3oRSxf
— ESPNcricinfo (@ESPNcricinfo) June 18, 2026
తద్వారా న్యూజిలాండ్ నుంచి మూడు ఫార్మాట్లలో శతక్కొట్టిన మూడో ఆటగాడిగా ఫిలిప్స్ రికార్డు పట్టేశాడు. అతడి కంటే ముందు మాజీ ఆటగాళ్లు బ్రెండన్ మెక్కల్లమ్, ఓపెనర్ మార్టిన్ గఫ్తిల్ టెస్టులు, వన్డేలు, టీ20ల్లో సెంచరీతో చెలరేగారు.