Glenn- Vini Maxwell | బేబీ మ్యాక్స్‌వెల్‌కు ఆశీర్వాదం.. వినీ మ్యాక్స్‌వెల్ శ్రీమంతం ఫొటోలు వైరల్
Glenn- Vini Maxwell : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell ) వారసుడు రాబోతున్నాడు. అతడి భార్య వినీ మ్యాక్స్‌వెల్(Vini Maxwell)కు ఈమధ్యే ఏడు నెలల నిండాయి. దాంతో, ఈరోజు వలైకప్పు(Valaikaappu ceremony) అంటే.. దక్షిణ భారత దేశంలో నిర్వహించే సాంప్రదాయ వేడుక శ్రీమంతం(Baby Shower) ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వాటికి 'ఆమె బేబీ మ్యాక్స్‌వెల్‌కు...
Glenn- Vini Maxwell : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell ) వారసుడు రాబోతున్నాడు. అతడి భార్య వినీ మ్యాక్స్‌వెల్(Vini Maxwell)కు ఈమధ్యే ఏడు నెలల నిండాయి. దాంతో, ఈరోజు వలైకప్పు(Valaikaappu ceremony) అంటే.. దక్షిణ భారత దేశంలో నిర్వహించే సాంప్రదాయ వేడుక శ్రీమంతం(Baby Shower) ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వాటికి ‘ఆమె బేబీ మ్యాక్స్‌వెల్‌కు మా సంప్రదాయ పద్ధతిలో ఆశీర్వాదం’ అని క్యాప్షన్ రాసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. వినీ సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనివ్వనుంది.
ఆసీస్ స్టార్ మ్యాక్స్‌వెల్, భారత సంతతికి చెందిన వినీ రామన్ నిరుడు మార్చిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 18న మొదటగా క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చర్చిలో వీళ్ల వివాహం జరిగింది. వారం తర్వాత తమిళ ఆచారం(Tamil Tradition) ప్రకారం మార్చి 27న పెళ్లి చేసుకున్నారు.
వినీ రామన్ మెల్‌బోర్న్‌లోనే పుట్టి పెరిగింది. అక్కడే ఫార్మసిస్ట్‌గా పనిచేసేది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకు ట్రావెలింగ్‌తో పాటు స్విమ్మింగ్, స్టేడియంలో మ్యాచ్‌లు చూడడమంటే మహా ఇష్టం. ఆన్లైన్ పాపులారిటితో ఆమెకు మ్యాక్స్‌వెల్‌తో పరిచయం ఏర్పడింది. వీళ్లిద్దరూ జంటగా 2019లో ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుకకు హాజరయ్యారు. అప్పుడే వీళ్ల ప్రేమ వ్యవహారం ప్రపంచం మొత్తానికి తెలిసింది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్, వినీ రామన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళురు(Royal Challengers Bangalore)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పదహారో సీజన్లో అతను విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించాడు. 11 మ్యాచుల్లో 186.44 స్ట్రైక్ రేటుతో 330 రన్స్ కొట్టాడు. వీటిలో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
మ్యాక్స్‌వెల్ – రాయల్ చాలెంజర్స్ బెంగళురు
అయితే. మ్యాక్స్‌వెల్‌తో పాటు విరాట్ కోహ్లీ(Virat Kohli), కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(Faf Duplesis) మాత్రమే ఆడడంతో ఆర్సీబీ ఈసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది.
ఇవి కూడా చదవండి
Babar Azam | దూషించడం కాదు.. ఆటలో మెరుగవ్వండి.. పాక్ ‘ఏ’ జట్టుకు బాబర్ చురకలు
Kylian Mbappe | వరల్డ్ కప్ హీరో ఎంబాపేకు బంపర్ ఆఫర్.. 2వేల కోట్లు ఇస్తామంటున్న సౌదీ క్లబ్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

