Glenn Maxwell | ఆస్పత్రిలో మ్యాక్స్‌వెల్.. విచారణకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా
Glenn Maxwell : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) ఆస్ప్రతి పాలయ్యాడు. అడిలైడ్‌లో రాత్రి జరిగిన ఓ పార్టీలో ఫుల్‌గా తాగిన మ్యాక్సీ స్వల్ప అస్వస్థతో దవాఖానలో చేరాడు. దాంతో క్రికెట్ అస్ట్రేలియా(Cricket Australia) ఈ విషయాన్ని...
Glenn Maxwell : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) ఆస్ప్రతి పాలయ్యాడు. అడిలైడ్‌లో జరిగిన ఓ పార్టీలో ఫుల్‌గా తాగిన మ్యాక్సీ.. స్వల్ప అస్వస్థతో దవాఖానలో చేరాడనే వార్తలు వినిపిస్తన్నాయి. దాంతో క్రికెట్ అస్ట్రేలియా(Cricket Australia) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అతడిపై తక్షణ విచారణకు ఆదేశించింది. అసలేం జరిగిందటే..?
మాజీ పేసర్ బ్రెట్ లీ(Brett Lee) సభ్యుడిగా ఉన్న ‘సిక్స్ అండ్ అవుట్’ బ్యాండ్ అడిలైడ్‌లో నిర్వహించిన కన్సర్ట్‌లో మ్యాక్స్‌వెల్ పాల్గొన్నాడు. అక్కడ ఆల్కహాల్ ఎక్కువగా సేవించాడట. దాంతో, కాసేపటికే అంబులెన్స్‌లో ఈ స్టార్ బ్యాటర్‌ను ఆస్పత్రికి తరలించారు. అందుకనే మ్యాక్సీని వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు పక్కనపెట్టారని సమాచారం.

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ఆస్ట్రేలియా సెలెక్టర్లు 13 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు. ప్యాట్ కమిన్స్‌కు విశ్రాంతినిచ్చి స్టీవ్ స్మిత్(Steve Smith) సారథిగా ఎంపిక చేశారు. ఊహించినట్టుగానే మ్యాక్స్‌వెల్, జే రిచర్డ్సన్లపై వేటు పడింది. వీళ్ల స్థానంలో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, గ్జావియర్ బార్ట్లెట్లను ఎంపిక చేశారు. ఆసీస్, విండీస్‌ల మధ్య ఫిబ్రవరి 2న తొలి వన్డే జరుగనుంది.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : స్టీవ్ స్మిత్(కెప్టెన్), ట్రావిస్ హెడ్(వైస్ కెప్టెన్), సియాన్ అబాట్, గ్జావియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హర్డీ, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, లాన్సే మోరిస్, మ్యాట్ షార్ట్, ఆడం జంపా.
ఇవి కూడా చదవండి
- BFI | వరల్డ్ క్యాలిఫికేషన్ టోర్నీకి స్టార్ బాక్సర్లు.. వీళ్ల పంచ్‌కు తిరుగుందా..?
- Sunita Lakshmareddy | బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది : సునితాలక్ష్మారెడ్డి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

