GT vs RR : క్వాలిఫయర్ 1లో కంగుతిన్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) భారీ స్కోర్‌తో సవాల్ విసిరినా శుభ్‌మన్ గిల్(104) శతకంతో కదం తొక్కి విజయాన్నందించాడు. సాయి సుదర్శన్(58)తో సెంచరీ భాగస్వామ్యంతో గెలుపు పునాది వేసిన గిల్ ఔటైనా.. ఇంప్యాక్ట్ సబ్ రాహుల్ తెవాటియా(17 నాటౌట్) లాంఛనం ముగించాడు. మే 31 ఆదివారం ఆర్సీబీతో అమీతుమీకి సిద్ధమైంది గుజరాత్.
ఎలిమినేటర్‌లో పంజా విసిరిన రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో తేలిపోయింది. ముల్లన్‌పూర్‌లో వైభవ్ సూర్యవంశీ(96) విధ్వసంతో 214 రన్స్ కొట్టినా.. బౌలర్ల వైఫల్యంతో ఆ జట్టును ముంచింది. భారీ ఛేదనలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్() శతకంతో రెచ్చిపోగా మూడో ఫైనల్ ఆడాలనుకున్న రాజస్థాన్ కల చెదిరింది.
A 𝙩𝙞𝙩𝙖𝙣𝙞𝙘 𝙧𝙪𝙣 to the #Final 💙@gujarat_titans make their way into the #TATAIPL 2026 finale 👏
Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/bK4JPh5Rpn
— IndianPremierLeague (@IPL) May 29, 2026
రాజస్థాన్ నిర్దేశించిన 215 పరుగుల భారీ ఛేదనను గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(104), సాయి సుదర్శన్(58)లు దూకుడుగా మొదలెట్టారు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లతో 19 రన్స్ రాబట్టారు. అయితే..14 పరుగుల వద్ద ఫెరీరా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన సుదర్శన్ కెప్టెన్‌తో కలిసి రెచ్చిపోయాడు. ఇద్దరూ బౌండరీలతో చెలరేగగా గుజరాత్ పవర్ ప్లేలో 69 పరుగులు చేసింది.
A knock to salute 🫡
A trademark celebration to frame 🖼️Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @gujarat_titans pic.twitter.com/noseNMmrib
— IndianPremierLeague (@IPL) May 29, 2026
క్రీజునంటుకున్న ఈ జోడీని విడదీసేందుకు పరాగ్ బౌలర్లను మార్చినా లాభం లేకపోయింది. 30 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న గిల్‌ను అనుసరిస్తూ సుదర్శన్ యాభైతో స్కోర్ వేగం పెరిగింది. అయితే.. విజయానికి 48 పరుగులు అవసరమైన వేళ సుదర్శన్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. బ్రిజేశ్ ఓవర్లో బౌండరీకి పంపిన సుదర్శన్ అనూహ్యంగా బ్యాట్ జారిపోయి వికెట్లకు తాకడంతో ఔటయ్యాడు. జడ్డూ ఓవర్లో బౌండరీతో ఈ సీజన్‌తో శతకం సాధించిన గిల్‌ను ఆర్చర్ ఎల్బీగా వెనక్కి పంపాడు. అప్పటికే గెలుపు వాకిట నిలిచిన గుజరాత్ సుందర్(16) వికెట్ కోల్పోయింది. బట్లర్(9 నాటౌట్), ఇంప్యాక్ట్ సబ్ రాహుల్ తెవాటియా(17 నాటౌట్)లు గెలిపించారు. దాంతో.. ఉసూరుమంటూ రాజస్థాన్ ఇంటిదారి పట్టగా.. ఆర్సీబీతో టైటిల్ పోరుకు సిద్ధమైంది గుజరాత్.
ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ(96) క్వాలిఫయర్ 2లో గర్జించాడు. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని ఈ చిచ్చరపిడుగు తన స్టయిల్ విధ్వంసంతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను బెంబేలెత్తించాడు. టెన్నిస్ ఫోర్ ఆర్మ్ షాట్లతో అలరించిన ఈ కుర్రాడు. రవీంద్ర జడేజా(45 నాటౌట్)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
వైభవ్ సూర్యవంశీ(96)

నాలుగు పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నా భారీ స్కోర్‌కు పునాది వేశాడు. రషీద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో ఫెరీరా(38 నాటౌట్) నాలుగు సిక్సర్లతో విరుచుకుపడగా రాజస్థాన్ ప్రత్యర్థి ముందు రెండొందలకుపైగా లక్ష్యాన్ని నిలిపింది.