లక్నో: ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియన్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. కెప్టెన్ శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ సెంచరీలతో చెలరేగారు. ఆ ఇద్దరూ ఆఫ్ఘన్ బౌలర్లతో దంచి కొడుతున్నారు. వన్డేల్లో గిల్ 9వ సెంచరీ నమోదు చేయగా, ఇషాన్ కిషన్ రెండో సెంచరీ చేశాడు. ఆ ఇద్దరు బ్యాటర్లు ఓకే ఓవర్లో సెంచరీలు కొట్టడం విశేషం. గిల్ సెంచరీలో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
ఇక ఇషాన్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 71 బంతుల్లో, గిల్ 77 బంతుల్లో సెంచరీలు చేశారు. ఇషాన్ కిషన్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఆ తర్వాత వేగాన్ని పెంచాడు. ఆ తర్వాత కేవలం 19 బంతుల్లోనే 50 రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. తాజా సమాచారం ప్రకారం 36 ఓవర్లలో ఇండియా రెండు వికెట్ల నష్టానికి 307 రన్స్ చేసింది.