Team India | హెడ్ కోచ్ సపోర్టింగ్ స్టాఫ్‌ని నియమించేది ఎప్పుడు..? గంభీర్ ప్రతిపాదించిన నలుగురి పేర్లను తిరస్కరించిన బీసీసీఐ..!
Team India | టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియాకమయ్యారు. టీ20 వరల్డ్ కప్ హెడ్ కోచ్ పదవీకాలం ముగియడంతో రాహుల్ దవ్రిడ్ తప్పుకున్నాడు. ఆ తర్వాత జట్టు సహాయక సిబ్బందిని సైతం బీసీసీఐ పక్కన పెట్టింది. ఇప్పటి వరకు కొత్త సిబ్బంది నియామకంపై స్పష్టత రాలేదు.
Team India | టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియాకమయ్యారు. టీ20 వరల్డ్ కప్ హెడ్ కోచ్ పదవీకాలం ముగియడంతో రాహుల్ దవ్రిడ్ తప్పుకున్నాడు. ఆ తర్వాత జట్టు సహాయక సిబ్బందిని సైతం బీసీసీఐ పక్కన పెట్టింది. ఇప్పటి వరకు కొత్త సిబ్బంది నియామకంపై స్పష్టత రాలేదు. బీసీసీఐతో పాటు కోచ్ గంభీర్ సైతం సహాయక సిబ్బందిని వెతికే పనిలో ఉన్నారు. అయితే, గతంలో సపోర్టింగ్ స్టాఫ్‌లో ఐదుగురు మాజీ ఆటగాళ్ల పేర్లను గంభీర్ బీసీసీఐకి సూచించాడని.. ఇందులో నలుగురి పేర్లను బీసీసీఐ తిరస్కరించినట్లు తెలుస్తున్నది. ఆర్ వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్, జాంటీ రోడ్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను గంభీర్ సూచించినట్లు తెలుస్తున్నది. ఇందులో కేవలం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న అభిషేక్ నాయర్‌కు మాత్రమే బీసీసీఐ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినా.. నాయర్‌పై బీసీసీఐ సుముఖంగా ఉందని.. మిగతా పేర్ల విషయంలో అంతగా ఆసక్తిని చూపడం లేదని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. వాస్తవానికి గతంలో కోచ్‌లుగా పని చేసిన రవిశాస్త్రి, దవ్రిడ్లకు కోచింగ్ స్టాఫ్‌ను ఎంచుకునే స్వేచ్ఛను బీసీసీఐ కల్పించగా.. గంభీర్‌కు ఆ స్వేచ్ఛ ఇవ్వడం లేదని తెలుస్తున్నది. మరో వైపు మాజీ టీమిండియా ఫాస్ట్ బౌలర్ జహీర్‌ఖాన్‌ను బీసీసీఐ బౌలింగ్ కోచ్‌గా నియమించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. మాజీ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ జహీర్ అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున 309 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 610 పది వికెట్లను కూల్చాడు. జహీర్‌తో పాటు లక్ష్మీపతి బాలాజీ పేరు సైతం బీసీసీఐ దృష్టికి వచ్చినా.. జహీర్పైనే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఈ నెల ఆఖరి వారంలో టీమిండియా శ్రీలంక పర్యటనక వెళ్లనున్నది. అప్పటి వరకు బీసీసీఐ కొత్త సపోర్టింగ్ స్టాఫ్‌ను నియమిస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

