Gautham Gambhir | ఆస్ట్రేలియా చేసిన అతిపెద్ద తప్పు అదే: గంభీర్
Gautham Gambhir | దుసార్లు విశ్వవిజేతలుగా నిలిచిన కంగారూలు ఈ సారి వరల్డ్‌కప్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకుండానే వచ్చారని ఒకరంటే.. వాళ్ల ఆటతీరులోనే లోపాలున్నాయని మరొకరి విమర్శిస్తున్నారు.
Gautham Gambhir | వన్డే ప్రపంచకప్‌లో తొలి విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియాపై విమర్శల పరంపర కొనసాగుతున్నది. ఐదుసార్లు విశ్వవిజేతలుగా నిలిచిన కంగారూలు ఈ సారి వరల్డ్‌కప్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకుండానే వచ్చారని ఒకరంటే.. వాళ్ల ఆటతీరులోనే లోపాలున్నాయని మరొకరి విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా కేవలం ఒక్క స్పిన్నర్తనే పని కానిచ్చేద్దాం అనుకోవడమే అతిపెద్ద తప్పని గౌతీ అభిప్రాయపడ్డాడు. స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పిచ్‌లపై ఒక్క స్పిన్నర్ సరిపోతాడని కంగారూలు ఎలా ఆలోచించారో తనకు మాత్రం అర్థం కావడం లేదని గంభీర్ అన్నాడు. ‘ఇది చిన్న తప్పిదమేం కాదు. స్పిన్‌కు అనుకూలించే చోట కేవలం ఒకే ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్‌తో బరిలోకి దిగడం అంటే ఆత్మహత్యా సాదృష్యమే. అలాంటిది అగర్ అందుబాటులో లేని సమయంలో మరో స్పిన్నర్‌ను ఎంపిక చేయాల్సింది పోయి.. అతడి ప్లేస్‌లో లబుషేన్‌ను జట్టులోకి తీసుకోవడమే అతిపెద్ద తప్పు’ అని గంభీర్ అన్నాడు.
తమ తొలి పోరులో టీమ్ఇండియా స్పిన్నర్లను ఎదుర్కోలేక స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత బ్యటింగ్ పిచ్‌పై భారీ ఛేదనలో తడబడి దక్షిణాప్రికా చేతిలో పరాజయం పాలైంది. దీంతో వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి (2019 వరల్డ్‌కప్‌లో ఆసీస్ ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది) చెత్త రికార్డు మూటగట్టుకుంది. ప్రపంచంలోనే మరో జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఇప్పటి వరకు ఐదుసార్లు వరల్డ్‌కప్‌ను చేజిక్కించుకున్న ఆసీస్ ఇలా మెగాటోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడటం ఇదే తొలిసారి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

