పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ వారం రోజుల పాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని టోర్నమెంట్ నిర్వాహకులు గురువారం నిర్ధారించారు. మెయిన్ డ్రా మ్యాచ్‌లు మే 30వ తేదీ నుంచి జూన్ ఆరవ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో టోర్నీని ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ పేర్కొన్నది. క్వాలిఫయింగ్ రౌండ్లను మే 24 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు.