పారిస్: ఓ వైపు ప్రైజ్‌మనీ వాటా విషయంలో వివాదం.. మరోవైపు వేసవి వేడి మధ్య మట్టి కోర్టు టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌షిప్ ఫ్రెంచ్ ఓపెన్‌కు తెరలేచింది. ఆదివారం మొదలయ్యే ఈ టోర్నీ ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో ఆటగాళ్లకు ఇచ్చే వాటాను 15 శాతం నుంచి 22 శాతానికి పెంచాలంటూ సబలెంక, సినర్, కోకో గాఫ్ వంటి టాప్ ప్లేయర్లు నిర్వాహకులతో తలపడుతున్నారు. ఇంకోవైపు పారిస్‌లో తీవ్రమైన వేడిని తట్టుకోవడం ఆటగాళ్లకు ప్రత్యర్థులతో సమానమైన సవాలుగా మారనుంది. ఆట పరంగా చూస్తే పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ గాయంతో తప్పుకోవడంతోనం.1 సినర్ 29 మ్యాచ్‌ల విజయ పరంపరతో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. తను టైటిల్ గెలిస్తే ఓపెన్ ఎరాలో ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ సాధించిన ఏడో ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.