ఫ్రాన్స్ x మొరాకో జట్ల మధ్య సెమీస్ పోరు.. గెలుపు ఎవరిదో..!
ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్, మొరాకో సెమీఫైనల్ కదన రంగంలోకి దూకుతున్నాయి.
ఫిఫా ప్రపంచకప్‌లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సంచలన విజయాలతో మేటి జట్లను మట్టికరిపిస్తూ టైటిల్ వేటలో దూసుకెళుతున్న జట్టు మొరాకో అయితే.. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్లు ప్రత్యర్థి జట్లకు దడ పుట్టిస్తున్నది ఫ్రాన్స్. ఆఫ్రికా ఖండం నుంచి తొలిసారి సెమీస్ పోరులో నిలిచిన మొరాకో అదే జోరులో ఫ్రాన్స్‌ను ఓడించి ముందంజ వేసేందుకు తహతహలాడుతున్నది.
ఎదురైనప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ తమకు తిరుగులేదంటూ దూసుకెళుతున్న ఫ్రాన్స్.. మొరాకోపై విజయంతో మరోమారు కప్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. మొత్తంగా యూరప్ టాప్ టీమ్ ఫ్రాన్స్..ఆఫ్రికా నయా సంచలనం మొరాకో మధ్య పోరు యుద్ధాన్ని తలపించే అవకాశముంది. పోరాటాన్ని నమ్ముకున్న మొరాకోను విజయం వరిస్తుందా లేక..సమిష్టితత్వంతో ఫ్రాన్స్ టైటిల్ పోరులో నిలుస్తుందో చూడాలి.
అర్ధరాత్రి 12.30 నుంచి స్పోర్ట్స్-18లో
దోహా: ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్, మొరాకో సెమీఫైనల్ కదన రంగంలోకి దూకుతున్నాయి. సుదీర్ఘ టోర్నీ చరిత్రలో తమ కప్ కలను సాకారం చేసుకునేందుకు మొరాకో ఒక్కో అడుగు ముందుకేస్తుంటే..ఫ్రాన్స్ ముచ్చటగా మూడోసారి కప్‌ను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఇరు జట్ల మధ్య జరిగే సెమీస్ ఫైట్‌కు అల్ బయత్ స్టేడియం సిద్ధమైంది. మెగాటోర్నీ మొదలైనప్పటి నుంచి తమ జట్టును వెన్నంటి నిలుస్తున్న అభిమానులు మొరాకోకు అదనపు బలం కాగా, తమ పటిష్ఠ బలగంతో మొరాకో పనిపట్టాలని ఫ్రాన్స్ చూస్తున్నది.
ప్రపంచ ర్యాంకింగ్స్ పరంగా ఫ్రెంచ్ టీమ్ 4వ ర్యాంక్‌లో ఉండగా, ఆఫ్రికా కసికూన 22వ ర్యాంక్‌లో ఉంది. ర్యాంకింగ్‌ల పరంగా భారీ తేడా కనిపిస్తున్నా..ఆ రోజు ప్రదర్శనకు తోడు అదృష్టం కలిసి వచ్చిన జట్టు ముందంజ వేస్తుంది.

ఎంబాపె సూపర్ ఫామ్: క్రిస్టియానో రొనాల్డో, నెయ్మర్ జూనియర్‌కు వారసుడిగా భావిస్తున్న ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కైలియన్ ఎంబాపె మెగాటోర్నీలో సూపర్‌ఫామ్ మీదున్నాడు. ఏకంగా ఐదు గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నాడు. మొరాకోతో మ్యాచ్‌లోనూ ఎంబాపె స్థాయికి తగ్గ జోరు కనబరిస్తే వరుసగా రెండోసారి ఫ్రాన్స్ టైటిల్ పోరులో నిలిచినట్లే. ఎంబాపెకు తోడు అంటోనీ గ్రిజ్మన్, ఒలీవర్ గిరౌడ్ జతకలిస్తే ఫ్రాన్స్‌కు తిరుగుండకపోవచ్చు.
డిఫెన్స్ బలంతో మొరాకో: మెగాటోర్నీలో మొరాకో డిఫెన్స్ ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా మారింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లాడిన మొరాకో..ప్రత్యర్థికి ఒకే ఒక గోల్ ఇచ్చుకుంది. ఇక్కడే అర్థమవుతుంది మొరాకో డిఫెన్స్ ఎంత బలంగా ఉందో. డిఫెండర్ అచ్రఫ్ హకిమీ, ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది. పారిస్ సెయింట్ జెర్మైన్ తరఫున ఆడుతున్న ఈ ఇద్దరికి ఒకరిపై ఒకరికి మంచి అవగాహన ఉంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో యూరప్ టామ్ టీమ్స్ స్పెయిన్, పోర్చుగల్‌ను ఓడించడం మొరాకో
ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశంగా మారింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

