EURO 2024 | ఫ్రాన్స్‌కు పెద్ద షాక్.. క్వార్టర్స్ వరకూ అతడు డౌటే..?
EURO 2024 : యూరో చాంపియన్‌షిప్‌లో ఫ్రాన్స్ (France)కు పెద్ద షాక్. ఆ జట్టు స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపే (Kylian Mbappe) లీగ్ దశ మ్యాచ్‌లు ఆడడంపై సందేహం నెలకొంది.
EURO 2024 : యూరో చాంపియన్‌షిప్‌లో ఫ్రాన్స్ (France)కు పెద్ద షాక్. ఆ జట్టు స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపే (Kylian Mbappe) లీగ్ దశ మ్యాచ్‌లు ఆడడంపై సందేహం నెలకొంది. ముక్కుకు బలమైన గాయం కావడంతో అతడు క్వార్టర్ ఫైనల్ వరకూ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఎంబాపే పూర్తిగా కోలుకునేందుకు 15 రోజులు పడుతుందని ఫ్రాన్స్ మేనేజ్మెంట్ తెలిపింది.
బుధవారం ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో ఎంబాపే గాయపడ్డాడు. హెడర్‌తో గోల్ చేసే ప్రయత్నంలో అతడి ముక్కుకు ప్రత్యర్థి ఆటగాడి భుజం బలంగా తాకింది. దాంతో నొప్పి తాలలేక ఫ్రాన్స్ స్టార్ కిందపడిపోయాడు. అనంతరం వైద్య బృందం చికిత్స అందించడంతో కాస్త కుదుటపడ్డాడు. కానీ, మళ్లీ మైదానంలోకి రాలేదు. ఆ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో ఆస్ట్రియాపై గెలుపొందింది.
⚡️#EURO2024 | #AUTFRA pic.twitter.com/KqjaodC0MV
— UEFA EURO 2024 (@EURO2024) June 17, 2024
హ్యాట్రిక్ గోల్స్‌తో
ఫుట్‌బాల్ సంచలనంగా పేరొందిన ఎంబాపే నిరుడు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో చిరస్మరణీయ ప్రదరశ చేశాడు. లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాను హ్యాట్రిక్ గోల్స్‌తో వణికించాడు. అయితే.. మ్యాచ్ చివరకు షూటౌట్లో 2-4తో ట్రోఫీ మిస్ అయింది. దాంతో, గోల్డెన్ బూట్ అవార్డుతో ఎంబాపే సరిపెట్టుకున్నాడు. ఎంబాపే ఈ మధ్యే కొత్త క్లబ్‌కు మారాడు. పారిస్ సెయింట్ జర్మనీ (PSG)ని వీడి స్పెయిన్క చెందిన రియల్ మాడ్రిడ్ (Real Madrid)క్లబ్‌తో భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి
- లోక్‌సభ స్పీకర్ ఎంపికపై సంప్రదింపులు : రాజ్‌నాథ్ నివాసంలో ముగిసిన మంత్రుల భేటీ
- AP News | ఏపీకి దీపావళి ముందే వచ్చింది.. ఐదేళ్ల జగన్ పాలనపై మంత్రి సత్యకుమార్ విమర్శలు
- Good news | తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక నడక సులభం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

