Unmukt Chand | అమెరికా జట్టులో భారత అండర్-19 కెప్టెన్.. వరల్డ్ కప్‌లో ఢీ అంటే ఢీ
Unmukt Chand : భారత అండర్ -19 జట్టు మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్(Unmukt Chand) టీ20 వరల్డ్ కప్ టోర్నీకి సన్నద్ధమవుతున్నాడు. అయితే.. ఈ మెగా టోర్నీలో అతడు ఆడేది టీమిండియాకు కాదు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి అడుగులు వేస్తున్న...
Unmukt Chand : భారత అండర్ -19 జట్టు మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్(Unmukt Chand) టీ20 వరల్డ్ కప్ టోర్నీకి సన్నద్ధమవుతున్నాడు. అయితే.. ఈ మెగా టోర్నీలో అతడు ఆడేది టీమిండియాకు కాదు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి అడుగులు వేస్తున్న అమెరికా(USA) జట్టుకు. అవును.. ఈ యంగ్‌స్టర్ అమెరికా తరఫున పొట్టి ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్నాడు. తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన ఈ యువకెరటం టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉండబోతుందని అన్నాడు.
‘ఇది నిజంగా కొత్త అనుభూతి. భారత క్రికెట్ నుంచి వైదొలిగాక.. భారత జట్టుకు ప్రత్యర్థిగా ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అలాగని నాకు భారత దేశంపై ఏ కోపం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుపై నా సత్తా నిరూపించుకోవాలనేది నా ఉద్దేశం’ అని ఉన్ముక్త్ వెల్లడించాడు. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. జూన్ 12వ తేదీన న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ స్టేడియంలో టీమిండియాతో అమెరికా జట్టు తలపడనుంది.

ఉన్ముక్త్ చంద్ 2012 అండర్ -19 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఉన్ముక్త్ సెంచరీతో కదం తొక్కాడంతో భారత జట్టు చాంపియన్‌గా అవతరించింది. దాంతో, అందరూ అతడు టీమిండియా భవిష్యత్ స్టార్ అవుతాడని భావించారంతా. కానీ, ఉన్ముక్త్ మాత్రం జాతీయ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. దాంతో, 2021 సెప్టెంబర్‌లో బీసీసీఐ(BCCI)తో తెగ తెంపులు చేసుకున్న ఈ యువకెరటం భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికి అమెరికా విమానం ఎక్కేశాడు.

అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచ కప్ పోటీలకు మరో నాలుగు నెలలు మాత్రమే ఉంది. దాంతో ఈ మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా అన్ని జట్లు టీ0 సిరీస్‌లతో బిజీగా ఉన్నాయి. ఈమధ్యే భారత జట్టు సొంతగడ్డపై మూడు టీ20ల సిరీస్‌లో అఫ్గనిస్థాన్‌ను వైట్‌వాష్ చేసింది.
ఇవి కూడా చదవండి
- YSRCP | వైసీపీకి మరో షాక్.. నరసరావుపేట ఎంపీ రాజీనామా
- School Holiday: అయోధ్య కోసం స్కూల్‌కు సెలువు.. రిపోర్టు కోరిన కేరళ మంత్రి
- Mithila Palkar | గ్లామర్‌తో గాలం వేస్తున్న మిథిలా పాల్కర్..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

