దోహా: మాజీ నంబర్ వన్ మెద్వెదెవ్ తొలి ప్రయత్నంలోనే ఖతర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీని గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మెద్వెదెవ్ 6-4, 6-4తో ఆండీ ముర్రేను ఓడించి టైటిల్ దక్కించుకున్నాడు. రెండు సెట్లలోనూ మెద్వెదెవ్ ఆరంభంలోనే ఆధిక్యం ప్రదర్శించి విజయం అందుకున్నాడు. తొలి సెట్లో 4-1, రెండో సెట్లో 3-1 ఆధిక్యం కనబరిచాడు. ముర్రే ప్రతిఘటించినా మెద్వెదెవ్ అతడిని నిలువరించి కెరీర్లో 17వ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. గత వారం రోటర్డామ్ టోర్నీలోనూ మెద్వెదెవ్ టైటిల్ను గెలుచుకున్నాడు. దీనితో మెద్వెదెవ్ వరుస విజయాలు తొమ్మిదికి చేరుకున్నాయి.