FIFA World Cup | వి వాంట్ బీర్.. ఫిఫా వరల్డ్ కప్‌లో హోరెత్తిన నినాదాలు
FIFA World Cup | అభిమానుల అంచనాలను అందుకుంటూ ఫిఫా ప్రపంచకప్ ఆదివారం అట్టహాసంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఖతార్ రాజధాని దోహాలో నూతనంగా నిర్మించిన అల్ బయత్ స్టేడియంలో
FIFA World Cup | అభిమానుల అంచనాలను అందుకుంటూ ఫిఫా ప్రపంచకప్ ఆదివారం అట్టహాసంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఖతార్ రాజధాని దోహాలో నూతనంగా నిర్మించిన అల్ బయత్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చూపరులను కట్టిపడేశాయి. అయితే నిన్న జరిగిన ఖతార్, ఈక్వడార్ ప్రారంభ మ్యాచ్‌లో వి వాంట్ బీర్ నినాదాలు హోరెత్తాయి. ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగాన్ని అన్ని స్టేడియంలలో బీర్ల అమ్మకాలను నిషేధిస్తూ ఖతార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈక్వడార్ అభిమానులు స్టాండ్లలో నిల్చొని తమకు బీర్ కావాలంటూ గట్టిగా అరిచారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అయితే, వరల్డ్ కప్ జరిగే స్టేడియాల్లో ఆల్కహాల్‌పై నిషేధం విధించడం పట్ల అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. చాలామంది ఫిఫా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దాంతో, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్ఫాంటో దోహాలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించాడు. ‘ఒక రోజులో మూడు గంటలు బీరు తాగకున్నా మీరు బతుకుతారని నేను అనుకుంటున్నాను’ అంటూ విమర్శకులకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. అంతేకాదు ‘ఇప్పుడు ఉన్నవాటిలో ఆల్కహాల్‌పై నిషేధం అనేది పెద్ద సమస్య అయితే నేను బీచ్‌కి వెళ్తాను. డిసెంబర్ 18వ తేదీ వరకు అక్కడే సేదతీరుతాను’ అని ఇన్ఫాంటో అన్నాడు. దాంతో, ఆయన వ్యాఖ్యలపై కొందరు అభిమానులు మండిపడుతున్నారు.
వరల్డ్ కప్‌లో ఆల్కహాల్‌పై నిషేధం విధిస్తూ చివరి నిమషంలో ఫిఫా నిర్ణయం తీసుకుంది. వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరిగే ఎనిమిది స్టేడియాల్లో బీరు అమ్మకాలపై నిషేధం వర్తిస్తుంది. అయితే ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్, లైసెన్స్ ఉన్న కేంద్రాల్లో ఆల్కహాల్ దొరుకుతుంది. ముస్లిం దేశమైన ఖతర్‌లో మామూలుగానే ఆల్కహాల్‌పై నిషేధం ఉంటుంది. అక్కడ కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో మాత్రమే ఆల్కహాల్ దొరుకుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

