FIFA World Cup | ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్.. సెమీస్‌లో మొరాకోపై 2-0తో విజయం
FIFA World Cup |ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి తుది పోరుకు చేరింది. ఆఫ్రికా జట్టు మొరాకోతో జరిగిన సెమీస్‌లో 2-0తో ఫ్రాన్స్ విజయం
FIFA World Cup |ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి తుది పోరుకు చేరింది. ఆఫ్రికా జట్టు మొరాకోతో జరిగిన సెమీస్‌లో 2-0తో ఫ్రాన్స్ విజయం సాధించింది. ఆధ్యంతం నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు పూర్తిస్థాయిలో ఆధిపత్యం చెలాయించి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో మరోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫైనల్ చేరిన అర్జెంటీనాతో ఆదివారం జరుగనున్న తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనుంది.

మ్యాచ్ ప్రారంభమైన 5వ నిమిషంలోనే ఫ్రాన్స్ ఆటగాడు థియో హెర్నాండెజ్ కళ్లుచెదిరే రీతిలో గోల్ సాధించాడు. దీంతో జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఫ్రాన్స్ డిఫెండర్లు మొరాకోకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడంతో ఆట ప్రథమార్థం ముగిసినప్పటికీ ఖాతా తెరువలేకపోయింది. ఇక సెకండాఫ్‌లో ఫ్రాన్స్ మరో గోల్ సాధించింది. మ్యాచ్ 76వ నిమిషం వద్ద సూపర్‌సబ్ రాండల్ కోలో మువానీ చేసిన గోల్‌తో ఆ జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ చివరివరకు ఆఫ్రికన్ జట్టు ఆటగాళ్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమడంతో డిఫెండింగ్ చాంపియన్ రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో బ్రెజిల్ తర్వాత వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన జట్టుగా ఫ్రాన్స్ రికార్డు సృష్టించింది. బ్రెజిల్ 2002లో రెండోసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

