Cristiano Ronaldo | ఫిఫా వరల్డ్ కప్ 2026: నేడు బరిలోకి క్రిస్టియానో రోనాల్డో.. కాంగోతో సమరం
Cristiano Ronaldo | ఫిఫా వరల్డ్ కప్ 2026 ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. ఈ టోర్నీలో భాగంగా నేడు రాత్రి 10:30 గంటలకు పోర్చుగల్ జట్టు డీఆర్ కాంగోతో కీలక పోరులో తలపడనుంది.
Cristiano Ronaldo | ఫిఫా వరల్డ్ కప్ 2026 ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. ఈ టోర్నీలో భాగంగా నేడు రాత్రి 10:30 గంటలకు పోర్చుగల్ జట్టు డీఆర్ కాంగోతో కీలక పోరులో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో బరిలోకి దిగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల కళ్లు ఈ మ్యాచ్‌పైనే నిలవబోతున్నాయి. గత మ్యాచ్‌లలో తనదైన శైలిలో గోల్స్ వర్షం కురిపించిన రోనాల్డో, నేటి పోరులో కూడా ప్రత్యర్థి డిఫెన్స్‌ను చీల్చుకుంటూ మరో హ్యాట్రిక్ నమోదు చేస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. అయితే రోనాల్డోను అడ్డుకోవడం డీఆర్ కాంగోకు అతిపెద్ద సవాల్ కాగా మారబోతుంది.
మరోవైపు పోర్చుగల్ జట్టులోని ఇతర స్టార్ ఆటగాళ్లు కూడా ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు అదనపు బలం. వయసుతో సంబంధం లేకుండా మైదానంలో రోనాల్డో చూపే చురుకుదనం, ఫిట్నెస్ నేటి తరం ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో ఈరోజు రోనాల్డో గోల్స్ వర్షం కురిపిస్తాడంటూ సోషల్ మీడియా వేదికల్లో ఫ్యాన్స్ పోస్టులు, వీడియోలతో సందడి చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ఫలితం టోర్నీ పాయింట్ల పట్టికలో పోర్చుగల్ స్థానాన్ని మరింత పటిష్టం చేసే అవకాశం ఉంది. డీఆర్ కాంగోను ఓడించి తదుపరి రౌండ్లోకి దూసుకెళ్లాలని పోర్చుగల్ వ్యూహాలు సిద్ధం చేసింది. మొత్తానికి నేటి రాత్రి జరగనున్న ఈ ఫుట్‌బాల్ సమరం రసవత్తరంగా సాగడం ఖాయమని ఫుట్‌బాల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

