FIFA World Cup 2026 | రొనాల్డోకు నిరాశ.. కోలంబియాతో మ్యాచ్ డ్రా చేసుకుని నాకౌట్‌కు చేరిన పోర్చుగల్!
Portugal Vs Colombia | మయామిలోని హార్డ్ రాక్ స్టేడియంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ K హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పోర్చుగల్, కోలంబియా జట్లు 0-0 తో డ్రాగా వెనుదిరిగాయి.
Cristiano Ronaldo | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ K హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పోర్చుగల్, కోలంబియా జట్లు 0-0 తో డ్రాగా వెనుదిరిగాయి. మయామిలోని హార్డ్ రాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలోని స్టార్ అటాకర్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఇరు జట్ల గోల్ కీపర్ల అసాధారణ ప్రతిభ వల్ల మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. పోర్చుగల్ గోల్‌కీపర్ డియోగో కోస్టా ఏకంగా ఆరు అద్భుతమైన సేవ్స్‌తో కోలంబియా దూకుడుకు అడ్డుకట్ట వేయగా, మరోవైపు కోలంబియా కీపర్ కామిలో వర్గాస్ కూడా బ్రూనో ఫెర్నాండెజ్ కొట్టిన ప్రమాదకరమైన షాట్‌ను నిలిపివేసి తన జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆట ఆఖరి నిమిషాల్లో ఒక ఆఫ్‌సైడ్ డ్రామా కూడా చోటుచేసుకుంది. ఆట 91వ నిమిషంలో కోలంబియా డిఫెండర్ డానిన్సన్ సాంచెజ్ హెడర్ ద్వారా గోల్ చేసి కోలంబియాను గెలిపించినంత పని చేశాడు, కానీ వీఏఆర్ (VAR) పరిశీలనలో అది కాస్తా ఆఫ్‌సైడ్‌గా తేలడంతో అంపైర్లు ఆ గోల్‌ను తిరస్కరించారు. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను కోలంబియా డిఫెండర్లు తీవ్రంగా మార్క్ చేయడంతో ఆయన ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఈ డ్రాతో లభించిన ఒక పాయింట్‌తో కోలంబియా గ్రూప్ K లో మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఒక డ్రాతో మొత్తం 7 పాయింట్లు సాధించి అగ్రస్థానంతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. అలాగే పోర్చుగల్ జట్టు మూడు మ్యాచ్‌లలో ఒక విజయం, రెండు డ్రాలతో 5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రాండ్ ఆఫ్ 32 నాకౌట్ స్టేజ్‌లోకి ప్రవేశించింది. ఇదే గ్రూప్‌లో నాలుగు పాయింట్లతో డీఆర్ కాంగో మూడో స్థానంలో, ఒక్క పాయింట్ కూడా సాధించని ఉజ్బెకిస్తాన్ చివరి స్థానంలో నిలిచి టోర్నీ నుండి నిష్క్రమించాయి. ఈ డ్రా ఫలితం కారణంగా రాండ్ ఆఫ్ 32 నాకౌట్ రౌండ్లో పోర్చుగల్ జట్టు బలమైన క్రొయేషియాతో తలపడాల్సి ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

