RCB vs RR : స్వల్ప ఛేదనలో దంచికొడుతున్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తొలి వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్లో ఫెర్గూసన్ యార్కర్‌ను అంచనా వేయలేక టామ్ కొహ్లెర్ కార్డ్మోర్(20) బౌల్డయ్యాడు. దాంతో, 46 వద్ద బెంగళూరుకు తొలి బ్రేక్ లభించింది. మరో ఎండ్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(25) బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. దాంతో, రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 47 రన్స్ కొట్టింది. ఇంకా విజయానికి 85 బంతుల్లో 126 పరుగులు కావాలి.
ఆర్సీబీని తక్కువ కట్టడి చేసిన రాజస్థాన్‌కు ఓపెనర్లు యశస్వీ, కార్డ్మన్లు శుభారంభమిచ్చారు. ముఖ్యంగా సిరాజ్, దయాల్ ఓవర్లలో యశస్వీ ఎడాపెడా ఫోర్లు బాదాడు. మరోవైపు 11 రన్స్ వద్ద మ్యాక్స్‌వెల్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన కార్డ్మోర్ ఆ తర్వాత జోరు పెంచాడు. అయితే.. ఫెర్గూసన్‌కు బంతి అందించిన డూప్లెసిస్ ఈ జోడీని విడదీయడంలో సక్సెస్ అయ్యాడు.
Crashed into the stumps! 🔥
Royal Challengers Bengaluru gets their first breakthrough as Lockie Ferguson strikes ⚡️⚡️
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/7JvKPYaeT2
— IndianPremierLeague (@IPL) May 22, 2024