Tokyo Olympics: ఫెన్సింగ్ రెండో రౌండ్లో ఓడిన భవానీ దేవి
భవానీ దేవి| ఒలింపిక్స్‌లో భారత ఫెన్సర్ భవానీ దేవికి చుక్కెదురయింది. ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో ఓడిపోయింది. ఫ్రాన్స్‌కు చెందిన మనన్ బ్రూనెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-15 తేడాతో ఓటమిపాలైంది.

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత ఫెన్సర్ భవానీ దేవికి చుక్కెదురయింది. ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో ఓడిపోయింది. ఫ్రాన్స్‌కు చెందిన మనన్ బ్రూనెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-15 తేడాతో ఓటమిపాలైంది. మొదటిసారిగా ఒలింపిక్స్ ఆడుతున్న 27 ఏండ్ల భవానీ దేవి.. తన తొలి పోరులో టునీషియాకు చెందిన నదియాపై విజయం సాధించి శుభారంభం పలికింది. 15-3 పాయింట్ల తేడాతో గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించింది. అయితే రెండో రౌండ్లో ఓడిపోవడంతో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆమె పూర్తిపేరు చదలవాడ ఆనంద సుంధరరామన్ భవానీ దేవి.

టేబుల్ టెన్నిస్ పురుషుల రెండో రౌండ్లో ఆచంట శరత్ కమల్ విజయం సాధించాడు. పోర్చుగల్ ప్లేయర్ అపోలోనియా టియాగోపై 4-2 తేడాతో చారిత్రక విజయం సొంతం చేసుకున్నాడు. 49 నిమిషాల్లోనే వరల్డ్ 59వ ర్యాంక్ ఆటగాడిని 2-11 11-8 11-5 9-11 11-6 11-9 స్కోర్‌తో మట్టికరిపించి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో మనికా బాత్రా మూడో రౌండ్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

