Sanket Sargar | గెలిచినందుకు సంతోషమే కానీ స్వర్ణం రానందుకు నిరాశగా ఉంది : సంకేత్ సర్గర్
కామన్వెల్త్ క్రీడలలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 55 కిలోల కేటగిరీలో రజతం గెలిచి భారత్‌కు తొలి పతకం అందించిన సంకేత్ సర్గర్ తాను మెడల్ గెలిచినా నిరాశగా ఉందని అన్నాడు. 55 కిలోల ఈవెంట్లో సంకేత్.. స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 135 కిలోల బరువు ఎత్తాడు.
మొత్తంగా 248 కిలోల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. తొలిస్థానంలో నిలిచిన మలేషియా ఆటగాడు బిబ్ అనిక్.. 249 కిలోలతో స్వర్ణం నెగ్గాడు. సంకేత్, అనిక్ మధ్య తేడా కిలో మాత్రమే. ఈ నేపథ్యంలో పోటీ ముగిశాక సంకేత్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘పతకం గెలిచినందుకు సంతోషమే. కానీ స్వర్ణం గెలుస్తానని అనుకున్నా. స్వర్ణం చేజారినందుకు నిరాశగా ఉంది. సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తున్నందుకు నామీద నాకే కోపంగా ఉంది..’అని ఆవేదన వ్యక్తం చేశాడు.
క్లీన్ అండ్ జెర్క్‌లో రెండో ప్రయత్నంలో సంకేత్ గాయపడ్డాడు. అతడి ఎడమ మోచేతికి గాయమైంది. దీంతో అతడు నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆ సమయంలో డాక్టర్ తనను బరువు ఎత్తితే గాయం మరింత పెరిగే అవకాశముంటుందని హెచ్చరించినా.. సంకేత్ మాత్రం పోడియం వద్దకు వచ్చి తన శక్తినంతా కూడదీసుకుని బరువు ఎత్తాడు.
‘నేను దేశం కోసం పతకం గెలిచాను. ఇది చాలా బాగుంది. నేను ఇక భవిష్యత్ లక్ష్యాల మీద దృష్టి సారించాలి. మీరాబాయి చాను నాకు స్ఫూర్తి. ఆమెను ఎప్పుడు అడిగినా సలహాలిస్తుంది. నేనిక్కడిదాకా వచ్చానంటే దానికి నా తల్లిదండ్రుల కష్టమే కారణం. ఈ సందర్భంగా నేను వాళ్లకు, నా కోచ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..’ అని అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

