ఫెదరర్ శుభారంభం

తొలిరౌండ్లో రోజర్ అలవోక గెలుపు
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: 487 రోజుల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అడుగుపెట్టిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వీరుడు ఫెదరర్ 6-2, 6-4, 6-3 తేడాతో అన్‌సీడెడ్ డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్థాన్)ను గంటా 33 నిమిషాల్లోనే చిత్తుచేశాడు. మ్యాచ్ మొత్తం మీద 8 ఏస్‌లు బాదిన ఫెడ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరోమ్యాచ్‌లో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ 6-3, 6-3, 7-5 తేడాతో అలెగ్జాండర్ బుబ్లిక్పై గెలిచాడు. ఐదో సీడ్ సిట్సిపాస్ 7-6 (8/6), 6-3, 6-1తో చార్డీపై విజయం సాధించాడు.
స్వియాటెక్ గెలుపు, అండ్రెస్కూకు షాక్
ఫ్రెంచ్ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పొలాండ్) తన 20వ పుట్టిన రోజున అద్భుత విజయం అందుకుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో స్వియాటెక్ 6-0, 7-5 తేడాతో జువాన్ (స్లొవేనియా)పై గెలిచింది. ఆరో సీడ్ బియాంక అండ్రెస్కూ (కెనడా) 7-6 (7/1), 6-7 (2/7), 7-9 తేడాతో జిడాన్సెక్ చేతిలో పరాజయం పాలైంది. కాగా మీడియా సమావేశాలను బహిష్కరిస్తూ వచ్చిన స్టార్ ప్లేయర్ నవోమీ ఒసాకా టోర్నీ నుంచి తప్పుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- federer
- French Open
- paris
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

