Federer – Nadal | నాదల్ అకాడమీలో టెన్నిస్ దిగ్గజం.. ఫొటోలు చూశారా..!
Federer - Nadal : టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్(Roger Federer ), రఫెల్ నాదల్(Rafeal Nadal) మళ్లీ కలిశారు. రేండేండ్ల క్రితం ఆటకు వీడ్కోలు పలికిన ఫెదరర్ స్పెయిన్‌లోని నాదల్ అకాడమీకి వెళ్లాడు. తన స్నేహితుడి రాకతో సంతోషంలో మునిగిపోయిన...
Federer – Nadal : టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్(Roger Federer ), రఫెల్ నాదల్(Rafeal Nadal) మళ్లీ కలిశారు. రేండేండ్ల క్రితం ఆటకు వీడ్కోలు పలికిన ఫెదరర్ స్పెయిన్‌లోని నాదల్ అకాడమీకి వెళ్లాడు. తన స్నేహితుడి రాకతో సంతోషంలో మునిగిపోయిన నాదల్ అకాడమీ అంతా చూపించాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోను నాదల్ షేర్ చేశాడు. ‘నా స్నేహితుడా.. నువ్వు ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చాడు.
ప్రపంచ టెన్నిస్‌లో నాదల్, ఫెదరర్ ఇద్దరూ ఇద్దరే. వీళ్లిద్దరూ తొలిసారి 20024లో మియామి మాస్టర్స్‌లో తలపడ్డారు. అప్పుడు నాదల్ వయసు 17 ఏండ్లు. అప్పటికే ఫెదరర్ వరల్డ్ నంబర్ 1. కానీ, నాదల్ ధాటికి ఫెదరర్ చేతులెత్తేశాడు. దాంతో, అప్పటి నుంచి వీళ్ల మ్యాచ్ ఉందంటే చాలు అభిమానులతో గ్యాలరీలు నిండిపోయేవి. ఫెదరర్ గ్రాస్ కోర్టుపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తే.. నాదల్ మట్టి కోర్టులో కింగ్‌గా వెలుగొందాడు.
కొన్ని ఏండ్లపాటు టెన్నిస్ కోర్టు ఏలిన ఈ ఇద్దరూ రికార్డు స్థాయిలో గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కొల్లగొట్టారు. మైదానంలో బద్ధ శత్రువుల లెక్క పోరాడిన ఈ ఇద్దరూ కోర్టు బయట మంచి స్నేహితులుగా మెలిగారు. అందుకే నాదల్, ఫెదరర్ టెన్నిస్‌లో లెజెండరీ ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం నొవాక్ జకోవిచ్ 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉండగా.. నాదల్ 22 గ్రాండ్ స్లామ్స్‌తో రెండో స్థానంలో, ఫెదరర్ 21 గ్రాండ్‌స్లామ్స్ మూడో స్థానంలో నిలిచారు.
నిరుడు తొడ కండరాల గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమైన నాదల్ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీతో పునరామనం చేశాడు. దాంతో, ఆస్ట్రేలియన్ ఓపెన్(australian open 2024)లో అతడు బరిలో దిగడం ఖాయమని అనుకున్నారంతా. కానీ, అనుకోకుండా రఫా మళ్లీ గాయపడ్డాడు. దాంతో, అనూహ్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం స్వదేశంలో కోలుకుంటున్న నాదల్ వచ్చే నెలలో జరిగే ఏటీపీ టోర్నీలో ఆడే చాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి
- Navy Chief: ఎన్డీఏ క్యాడెట్స్‌తో నేవీ చీఫ్ పుష్-అప్స్.. వీడియో
- Australia Open | ఆరో సీడ్‌ను ముప్పతిప్పలు పెట్టిన క్వాలిఫయర్.. మూడో రౌండ్‌కు కాస్పర్
- Warangal | వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం.. రూ.7.80 లక్షల నగదు అపహరణ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

