వైరల్‌గా మారిన రొనాల్డో పాత కోకాకోలా ప్రమోషన్ వీడియో.. ఫ్యాన్స్ విమర్శలు

లండన్: ఈ మధ్య పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో చేసిన పని ప్రముఖంగా వార్తల్లో నిలిచిన విషయం తెలుసు కదా. యూరో 2020లో భాగంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన ముందు ఉన్న కోకాకోలా బాటిల్స్‌ను తీసి పక్కనపెట్టాడు. కోలాలు వద్దు, నీళ్లే ముద్దు అన్న సందేశం ఇచ్చాడు. అతడు చేసిన ఈ పని వల్ల కోకాకోలాకు సుమారు రూ.30 వేల కోట్ల నష్టం వాటిల్లింది. తాను సాఫ్ట్ డ్రింక్స్‌కు పూర్తిగా వ్యతిరేకమని రొనాల్డో చెప్పాడు.
కానీ తాజాగా అతనికి సంబంధించిందే ఓ వీడియో వైరల్ అవుతోంది. అది చూసి నువ్వో కపటం ఉన్న వ్యక్తివంటూ రొనాల్డోపై అభిమానులు మండిపడుతున్నారు. గతంలో ఇదే కోకాకోలాను ప్రమోట్ చేస్తూ రొనాల్డో చేసిన వీడియో ఇది. 2008లో వచ్చిన ఈ వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రొనాల్డోను ఇరకాటంలో పెట్టారు. ఇదొక్కటే కాదు 2013లో అతడు కేఎఫ్‌సీ చికెన్‌ను ప్రమోట్ చేసిన విషయాన్ని కూడా ఫ్యాన్స్ ఇప్పుడు బయటపెట్టారు.
ఓ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఇలాంటి డ్రింక్స్, ఫుడ్‌కు దూరంగా ఉండాలి. రొనాల్డో కూడా తన ఫిట్నెస్, డైట్‌పై బాగానే దృష్టిసారిస్తాడు. సాఫ్ట్ డ్రింక్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని తన కొడుకుకు కూడా తాను సూచిస్తాననీ రొనాల్డో చెబుతాడు. కానీ తాజా వీడియోలు మాత్రం రొనాల్డోను ఇరకాటంలో పెట్టాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

