Virat Kohli | అభిమానికి పెళ్లి రోజు కానుకగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ
జనవరి 15న మూడో వన్డేలో 74వ అంతర్జాతీయ శతకం చేసిన కోహ్లీ
Virat Kohli : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అభిమానికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అతని పెళ్లి రోజున 74వ శతకం బాదాడు. ఇంతకు అతను ఎవరంటే.. అమన్ అగర్వాల్. కోహ్లీ ఫామ్ లేమితో బాధ పడుతున్న సమయంలో ఇతను ఏం చేశాడంటే.. 71వ సెంచరీ కొట్టేంత వరకు నేను పెళ్లి చేసుకోను అని రాసున్న ప్లకార్డుతో స్టేడియంలో దర్శనమిచ్చాడు. దాంతో, అప్పట్లో అతని ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈమధ్యే అమన్ అగర్వాల్‌కి పెళ్లి కుదిరింది. అతనిపెళ్లి రోజు జనవరి 15న శ్రీలంక మీద మూడో వన్డేలో కోహ్లీ 74వ అంతర్జాతీయ శతకం బాదాడు. దాంతో, అమన్ అనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో తాను ప్లకార్డు పట్టుకున్న ఫొటో, పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. అ ఫొటోకు.. ‘నేను 71వ సెంచరీ అడిగాను. కానీ, అతను నా పెళ్లి రోజున 74వ శతకం సాధించాడు’ అని క్యాప్షన్ రాశాడు.
2019 నుంచి 2022 ఆసియా కప్ వరకు.. ఈ మూడేళ్ల కాలంలో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఒకప్పుడు పరుగుల వరద పారించిన అతను అభిమానులను నిరాశపరిచాడు. దాంతో నెల రోజులు విరామం తీసుకున్నాడు. 2022లో శ్రీలంకలో జరిగిన ఆసియాకప్‌లో సెంచరీ కొట్టాడు. టీ20 వరల్డ్ కప్‌లో అదే ఫామ్ కొనసాగించాడు. బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో (110), స్వదేశంలో శ్రీలంకతో తొలి వన్డేలో (116), మూడో వన్డేలో (166) వరుస సెంచరీలతో చెలరేగుతున్నాడు.
“I asked for the 71st century but he scored 74th on my special day” ❤️❤️❤️@imVkohli @AnushkaSharma @StayWrogn pic.twitter.com/zHopZmzKdH
— Aman Agarwal (@Aman2010Aman) January 16, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

