Prithvi Shaw | అమ్మాయిలకు దూరంగా ఉండు.. కోహ్లీలా ఫిట్‌గా అవ్వు.. పృథ్వీ షా ఏమన్నాడంటే..?
Prithvi Shaw : భారత యువ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే కప్(One Day Cup)లో చెలరేగిన విషయం తెలిసిందే. లావెక్కిన అతడు ఈ టోర్నీ సమయంలో బాడీ షేమింగ్ (Body Shaming)కు గురయ్యాడు. తాజాగా ఈ స్టార్ బ్యాటర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో విచిత్ర పరిస్థితి ఎదురైంది. బొద్దుగా ఉన్న అతడికి ఓ అభిమాని ఉచిత సలహా ఇచ్చాడు. 'అమ్మాయిలకు దూరంగా ఉండు. విరాట్ కోహ్లీ(Virat Kohli)లా.....
Prithvi Shaw : భారత యువ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే కప్(One Day Cup)లో చెలరేగిన విషయం తెలిసిందే. లావెక్కిన అతడు ఈ టోర్నీ సమయంలో బాడీ షేమింగ్ (Body Shaming)కు గురయ్యాడు. తాజాగా ఈ స్టార్ బ్యాటర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో విచిత్ర పరిస్థితి ఎదురైంది. బొద్దుగా ఉన్న అతడికి ఓ అభిమాని ఉచిత సలహా ఇచ్చాడు. ‘అమ్మాయిలకు దూరంగా ఉండు. విరాట్ కోహ్లీ(Virat Kohli)లా ఫిట్‌గా తయారవ్వు. ఫిట్నెస్ కోసం కోహ్లీ ఎలాంటి వ్యాయామాలు చేస్తాడో అవన్నీ నువ్వు చేయ్’ అని సదరు అభిమాని షాను కోరాడు.
అతడి పోస్ట్ చూసిన పృథ్వీ షా ఆసక్తికర రిప్లయ్ ఇచ్చాడు. ‘సరే పండిత్ జీ. మీ అజ్ఞ’ అంటూ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం పృథ్వీ షా మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ మధ్యే సర్జరీ చేయించుకున్న ఈ స్టార్ ఓపెనర్ కొన్నాళ్లు క్రికెట్‌కు దూరం కానున్నాడు. దాంతో, తర్వలో మొదలవ్వనున్న దేశవాళీ ట్రోఫీలకు అందుబాటులో లేనని ప్రకటించాడు. దులీప్ ట్రోఫీతో పాటు విజయ్ హజారే ట్రోఫీల్లో అతను బరలోకి దిగడం లేదు.

ఏపీఎల్ పదహారో సీజన్(IPL 2023)లో విఫలమైన పృథ్వీ షా వన్డే కప్‌తో ఫామ్ అందుకున్నాడు. నార్తంప్టన్‌షైర్ (Northamptonshire) జట్టు తరఫున బరిలోకి దిగిన షా 153 బంతుల్లో 244 రన్స్ కొట్టి ఔరా అనిపించాడు. రెండు దేశాల్లో 50 ఓవర్ల ఫార్మాట్లో ద్విశతకం బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఇవి కూడా చదవండి
England T20 Squad | ఇంగ్లండ్ యువ పేసర్‌కు గాయం.. టీ20 జట్టులో క్రిస్ జోర్డాన్
Spain Football Chief | ముదురుతున్న ముద్దు వివాదం.. న్యాయ పోరాటానికి సిద్ధమైన ఫుట్‌బాల్ సమాఖ్య
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

