బీసీసీఐ సంచలన నిర్ణయం.. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు
Women Cricketers pay policy:మెన్స్ క్రికెటర్లకు సమానంగా ఇక నుంచి మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించనున్నారు. బీసీసీఐ కార్యదర్శి జే షా దీనిపై ఇవాళ ప్రకటన చేశారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
న్యూఢిల్లీ: పురుషులతో సమానంగా ఇక నుంచి మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించనున్నారు. బీసీసీఐ కార్యదర్శి జే షా దీనిపై ఇవాళ ప్రకటన చేశారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళలు, పురుషుల మధ్య ఉన్న వివక్షను పారద్రోలుతున్నామని జే షా తన ట్వీట్లో తెలిపారు. బీసీసీఐతో కాంట్రాక్టు చేసుకున్న మహిళా క్రికెటర్లకు పే ఈక్విటీ పాలసీని అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. క్రికెట్లో లింగ సమానత్వానికి బీజం పడిందని, మగవారితో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించనున్నట్లు జే షా తన ట్వీట్లో తెలిపారు.
I’m pleased to announce @BCCI’s first step towards tackling discrimination. We are implementing pay equity policy for our contracted @BCCIWomen cricketers. The match fee for both Men and Women Cricketers will be same as we move into a new era of gender equality in 🇮🇳 Cricket. pic.twitter.com/xJLn1hCAtl
— Jay Shah (@JayShah) October 27, 2022
టెస్టు క్రికెట్ ఆడే ప్లేయర్లకు రూ.15 లక్షలు, వన్డే ప్లేయర్లకు 6 లక్షలు, టీ20 ప్లేయర్లకు రూ.2 లక్షలు మ్యాచ్ ఫీజుగా ఇస్తున్నారు. అయితే పురుష క్రికెటర్లకు సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి తెలిపారు. సమంగా మ్యాచ్ ఫీజు చెల్లిస్తానని మహిళా క్రికెటర్లకు మాట ఇచ్చానని, తనకు మద్దతుగా నిలిచిన అపెక్స్ కౌన్సిల్‌కు జే షా ధన్యవాదాలు తెలిపారు.
The @BCCIWomen cricketers will be paid the same match fee as their male counterparts. Test (INR 15 lakhs), ODI (INR 6 lakhs), T20I (INR 3 lakhs). Pay equity was my commitment to our women cricketers and I thank the Apex Council for their support. Jai Hind 🇮🇳
— Jay Shah (@JayShah) October 27, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

